ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ ఓటీపీల ద్వారా వినియో గదారుల ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరస్థుడిని అరెస్ట్ చేసినట్లు రాజాం రూరల్ సీఐ నవీన్‌కుమార్ తెలిపారు. ఆదివా రం రాజాంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అరుణ్‌సాల్మన్‌కు ఈ ఏడాది జూన్‌లో అపరిచితుడి నుంచి ఓ లింక్‌రావడంతో ఓపెన్ చేశారు. దీంతో ఆయనకు వచ్చిన ఓటీపీని అపరిచితుడికి షేర్‌చేయడంతో క్షణాల్లో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.4,90,640 కొల్లగొట్టారు. ఈ మేరకు ఆయన జూలై 27న సంతక విటి పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సంతకవిటి ఎస్‌ఐ జనార్దనరావు తన సిబ్బందితో కలిసి ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలించారు. ఈనేప ధ్యంలో యూపీకి చెందిన సుమిత్‌కుమార్ ఖాతాలో రూ.60వేలు జమ అయినట్లు వెల్లడికావడంతో ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి యూపీ చేరుకొని దర్యాప్తు చేసి సుమిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనతోపాటు మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు సుమిత్ కుమార్ తెలియజేశారు. త్వరలో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చెప్పారు. సమావేశంలో సంతకవిటి ఎస్‌ఐ జనార్దనరావు పాల్గొన్నారు.