ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 03:36 PM

ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన అరాచక పాలనను అంతమొందిస్తామని పెనుకొండ,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధి ఇస్లాపురం, తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో బీకే పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం బీకే మాట్లాడుతూ.. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలను అన్నివిధాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో పెనుకొండ వద్ద అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు దక్కాయ న్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన దుర్మార్గపు పాలన సాగిస్తున్నాడన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబును గెలిపించాలన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com