ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 03:37 PM

ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ కళ్యాణదుర్గం పాత మార్కెట్‌ వద్ద చేపట్టిన టీడీపీ రిలే దీక్ష మూడోరోజు ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి  టీడీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రజల తరపున పోరాటం చేస్తామని అన్నారు. భావితరాలు బాగుపడాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా దాడులు చేసే నీచసంస్కృతి ఈ ప్రభుత్వానిదని అన్నారు. జగనరెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. చివరిరోజున ఉమాను గజమాలలతో జనం సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com