శ్రీకాకుళం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు చైన్‌స్నాచర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్పీ జీఆర్ రాధిక తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామానికి చెందిన సూరాడ రాజు (32)చెడు వ్యసనాలకు బానిసై చోరీలను వృత్తిగా చేసుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకుని మెళియాపుట్టి, కాశీబుగ్గ, నౌపడ, ఇచ్ఛాపురం, కవిటి, మందస, వజ్రపుకొత్తూరు, ఒడిశా రాష్ట్రం గురండిలో మొత్తం 13 చోరీలకు పాల్పడ్డాడు. 20 తులాల బంగారు పుస్తెలతాళ్లు, చైన్లను అపహరించాడు. చోరీల కోసం నెంబర్ ప్లేట్ల్లేని బైక్‌లను వినియోగించేవాడు. సెల్ టవర్ లోకే షన్లు, సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్‌లను కనిపెట్టి పోలీసులు ఎట్టకేలకు రాజును పట్టుకున్నారు. 20 తులాల బంగారు ఆభరణాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫ ఈ ఏడాది మే 19న శ్రీకాకుళం నగరంలోని సౌత్ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఓ మహిళ మెడలో నుంచి, అదేరోజు ఇచ్ఛాపురంలో మరో మహిళ మెడలోని చైన్లను తెంచుకుని బైక్‌పై పరారైన ఇరానీ గ్యాంగ్‌కు చెం దిన హైదర్ ఆలి(26), బసు ఆలి(42)లను పోలీసులు పట్టుకున్నారు.