పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మార్కెట్ సెంటర్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పలుషాపుల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న దాదాపు 10 దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa