తన పైనా తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి... స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు అని టీడీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది. నారా బ్రాహ్మణి నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1600 కోట్లతో దివంగత జయలలితకు చెందిన ఫార్మ్ హౌస్ ను కొన్నారని... అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిది అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారు అని టీడీపీ నాయకులూ తెలియజేసారు.