What: రాయచోటి, వాటర్ షెడ్ పథకం అమలవుతున్న గ్రామాలలో జీవనోపాదులను మెరుగు పరచాలని వాటర్ షెడ్ అధికారులను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం తన ఛాంబర్ లో జిల్లాలో వాటర్ షెడ్ పథకం అమలు, అభివృద్ధి పనులపై వాటర్ షెడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సమీక్ష నిర్వహించారు. *
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. వాటర్ షెడ్ పథకంలో ఆ గ్రామంలో చేపట్టిన పనులు పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఏ గ్రామంలో అయితే వాటర్ షెడ్ పథకం అమలు అవుతుందో ఆ గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రంలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయాలన్నారు. పది రోజుల్లోగా విజిట్ చేసి ప్రపోజల్ పంపాలన్నారు. అలాగే ఆ గ్రామంలో ఉన్న దేవాలయంకు సైతం సోలార్ ప్యానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సచివాలయంకు వచ్చే ప్రజల కోసం వారు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వాటర్ షెడ్ లో ఒక పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఊరు సమీపంలో ఒక ఎకరా నుంచి రెండు ఎకరాల్లో హార్టికల్చర్, బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వాటర్ షెడ్ అమలవుతున్న గ్రామాలల్లో చెరువులు మరమతులకు గురై ఉంటే అటువంటి పనులను చేయడంతో పాటు ఒక మంచి చెరువును అభివృద్ధి చేయాలన్నారు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుందన్నారు. అలాగే ఆ గ్రామంలో కురిసిన వర్షపు నీరు అక్కడే ఇంకిపోయేలా పనులు చేపట్టలన్నారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్, మేకలు, గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిలో జీవనోపాదులను పెంపొందించాలన్నారు. గతంలో వాటర్ షెడ్ పథకం ద్వారా ఏ గ్రామాలలో ఏ ఏ పనులు చేపట్టారు, ఎంత ఖర్చు చేశారు వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాటర్ షెడ్ పథకం ఏ గ్రామంలో అమలవుతుందో. ఆ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారో వివరాలను తెలియజేయాలన్నారు*.ఈ సమీక్షలో డ్వామా పిడి మద్దిలేటి, వాటర్ షెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.