త్రిపురలోని ఖోవై జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఒకరిని అరెస్టు చేసినట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటాం అని తెలిపారు.