సమష్టి కృషితోనే టీడీపీ బలోపేతం అవు తుందని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయం లో బుధవారం సాయంత్రం పట్టణంలోని 5వక్లస్టర్ బాధ్యులతో నిర్వ హంచిన సమావేశంలో పార్టీ బలోపేతానికి అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త రోజుకు ఒక గంట పార్టీ కోసం పనిచేస్తే టీడీపీ విజయం సులభతరమవుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించి తమ సత్తా చాటి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి గుత్తికొండ కిషోర్‌బాబు, రాష్ట్రపార్టీ లీగల్ సెల్ నాయకులు పోట్లూరి శ్రీనివాసులు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల రఘుబాబు, యూనిట్ ఇంచార్జీలు మంచాల ప్రసాద్, గొర్రెపాటి బ్రహ్మయ్య, తటవర్తి వాసు, షేక్ రఫీ, ఏటూరి శివ బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa