అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఆలయం గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు... హుండీ తాళం పగలగొట్టి నగదు అపహరించారు. దారాలమ్మ అమ్మవారి ఒంటి మీద ఉన్న నగలు, హుండీలో దాచి ఉంచిన నగలను దుండగులు చోరీ చేశారు. సుమారు 3 లక్షల రూపాయల నగదు హుండీలోంచి చోరీ జరిగి ఉంటదని అంచనా. దుండగులు దొంగలించిన బంగారం విలువ రూ.80 లక్షల పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.