ప్రేమించిన వ్యక్తి కోసం కట్టుకున్న భర్త ప్రాణాన్నే భార్య బలితీసుకున్న ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్ కరీముల్లాను భార్య మాబుబి హత్య చేయించింది. మాబుబికి కడప జిల్లా పెద్దముడియం మండలం వంశీకుమార్ రెడ్డితో ఫేస్ బుక్ పరిచయం ఏర్పాడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుని కోసం భర్త అడ్డు తొలగించుకునేందుకు కరీముల్లాను ప్రియుడితో కలిసి మాబుబి హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని గోనెసంచిలో వేసి లింగందీన్నే రహదారిలో పొదల్లో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా... అసలు నిజం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.