సింహాద్రిపురం మండలంలో ఆయా తేదీల వారీగా సచివాలయాల్లో ఆధార్ అప్డేట్ సెంటర్లను ఏర్పాటు చేశారని. వీటిని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని ఎంపీడీఓ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గురిజాల గ్రామంలో ఆధార్ అప్డేట్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ సెంటర్ల ద్వారా పదేళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa