గుంటూరు జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డీజీఐ త్రివిక్రమ వర్మ కోరారు. బుధవారం జిల్లాలోని వివిధ కేసుల్లో పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న పోక్సో కేసులలో త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. దర్యాప్తుల్లో ఉన్న కేసులలో అలసత్వం లేకుండా దర్యాప్తును పూర్తి చేసి ఫిర్యాదుదారుడికి న్యాయం చేయాలన్నారు. యుఐ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు.