రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని ఆదరణ స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ అన్నారు. బుధవారం ప్రొద్దుటూరు స్థానిక సాంబయ్య గారి వీధికి చెందిన వీరమ్మ అను మహిళకు రక్తం అవసరమని ప్రవేటు ఆసుపత్రి వైద్యులు సూచించారు. దీనితో వారి బంధువులు ఆదరణ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ సంప్రదించారు. దీనితో సంస్థలోని సభ్యుడైన రాజుపాలెం మండలం అర్కట వేముల గ్రామానికి చెందిన అమరావతి శ్రీకాంత్ చేత రక్తదానం చేయించారు.