పెద్దకడుబూరు: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన కురువ మహాదేవా ( 36 ) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఈనెల 24 న తన సొంత పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పత్తి , వేరుశెనగ వంటి పంటలు చేతికందకపోవడంతో అప్పులు తీర్చలేక పురుగుల మందు సేవించినట్లు సమాచారం. అయితే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న కురువ మహాదేవను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా , చికిత్స పొందుతూ , కోలుకోలేక మృతి చెందాడు. మృతుని భార్య కురువ లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. మృతునికి కుమార్తె , ఇద్దరు కుమారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa