ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. సబలాయ గ్రామంలో తండ్రి కర్మకాండలు చేసేందుకు లలిత్ సాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. వంశధార నదిలో గొట్టబ్యారేజీ దిగువన కర్మకాండలు పూర్తి చేశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన లలిత్ కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే కొడుకుకు ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa