పశ్చిమ బెంగాల్‌లోని నదియా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకశిపరాలోని 34వ నంబరు జాతీయ రహదారిపై లారీ, కారు శుక్రవారం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. హుటాహుటిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa