ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఎంఎఫ్ఎంఈ ను సద్వినియోగం చేసుకోవాలి: డిఆర్డిఏ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 12:04 PM

స్వయం సహాయక సంఘాల మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయముతో అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం (పిఎంఎఫ్ఎంఈ) ను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఏ పి డి తులసి తెలిపారు. శనివారం డిఆర్డిఏ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న పి ఎం ఎఫ్ ఎం ఈ పథకం పై ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించుటకు ఏ పి ఫుడ్ ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ జనార్ధన్, హార్టి కల్చర్ డిడి మధుసూదన్ రెడ్డి, ఎల్ డి ఎం శేషగిరిరావు లతో కలసి స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com