పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుండి నిషేధించడం జరిగిందని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ ఎం ఎస్ నెం: 65 ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయడానికి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటర్ ల యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటర్ ల యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశమై నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ నిషేధమునకు సంబంధించి ప్రింటింగ్ యజమానులకు గల సమస్యలు సంబంధిత అంశాల పై చర్చించారు.