పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎం ఎల్ సి ఓటరు నమోదు మొదటి దశ ప్రక్రియ అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వ వరకు జరుగునని అర్హత ఉన్న పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో నమోదు చేసుకున్న వారి ఓట్లు చెల్లవని, కొత్తగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఎం ఎల్ సి ఓటరు నమోదు కొరకు ఫారం 18ని, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎం ఎల్ సి ఓటరు నమోదు కొరకు ఫారం 19 ని నింపి దరఖాస్తును నివాస అడ్రెస్స్ ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన మండల కార్యాలయాలు, రెవిన్యూ డివిజన్ కార్యాలయాలు, కలెక్టరేట్ లోని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని తెలిపారు.