కాంతార చిత్రం ఊహించని ఘన విజయాన్ని సాధించిందని, ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని హీరో, దర్శకుడు రిషబ్శెట్టి అన్నారు. విజయోత్సవ యాత్రలో భాగంగా తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్లో శనివారం చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు తెలుగుప్రేక్షకులు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు ఎంతో విలువైనవని అన్నారు. భాషా భేదం లేకుండా హిందూ సాంస్కృతి సంప్రదాయాల పట్ల తెలుగుప్రేక్షకులు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. రెండు నెలల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటిస్తానన్నారు. రిషబ్శెట్టిని టీటీడీ విశ్రాంత డిప్యూటీఈవో చిన్నంగారిరమణ, శ్రీలక్ష్మీమూవీస్ అధినేత పూజనాగిశెట్టి, నగర కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గజమాలతో సత్కరించారు.