ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే కుటుంబంలో పలు విషాద సంఘటనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 12:28 PM

ముంచంగిపుట్టులో విషాదం చోటుచేసుకొంది. ఒకరోజు వ్యవధిలో తల్లీ కుమారుడి మరణాలు తీవ్ర ఆవేదనకు గురి చేసాయి . వివరాల్లోకి వెళ్ళితే...  ముంచంగిపుట్టులోని సంతబయలు ప్రాంతానికి చెందిన గంపరాయి కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణ ఎనిమిది నెలలు క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, పెద్ద కుమారుడు వినోద్‌ కుమార్‌ తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాద సంఘటనల నుంచి కుటుంబీకులు తెరుకోకముందే గురువారం రాత్రి కృష్ణ భార్య పుష్ప(40) అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు సాయికుమార్‌ (21) తల్లి మృతిని పదే పదే తలుచుకుంటూ జీర్ణించుకోలేక శనివారం ఉదయం మరణించాడు. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు చనిపోవడంతో ప్రియాంక అనాధగా మిగిలింది. ఆమె రోదన చూసిన వారి హృదయాలు బరువెక్కాయి. అందరినీ కోల్పోయి దిక్కులేకుండా ఉన్న ప్రియాంకను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com