రక్తదానం చేయడం అంటే ఒక మనిషికి పునర్జన్మను ప్రసాదించడం అని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ అన్నారు. శనివారం భీమవరం ఎల్‌హెచ్ టౌన్‌హాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తదానంలో సుమారు రెండు వందల యూనిట్‌ల వరకు రక్తాన్ని సేకరించి ప్రభుత్వాసుత్రికి, రెడ్‌క్రాస్ ద్వారా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి అందజేస్తామన్నారు. పోలీస్‌శాఖ సిబ్బంది, ఆటోడ్రైవర్లు, విద్యార్ధులు, ప్రజలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.సుబ్బరాజు, అదనపు ఎస్పీ సెబ్ ఏటీవీ రవికుమార్, భీమవరం పట్టణ, రూరల్ సీఐలు, ట్రాఫిక్ సీఐ, ఎస్‌ఐలు, పాల్గొన్నారు.