ఈక్రాప్ నమోదుపై ప్రభుత్వం సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈక్రాప్ నమోదు విస్తీర్ణానికి సంబంధించి ఒక శాతం కలెక్టర్, రెండు శాతం జాయింట్ కలెక్టర్ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రాప్ నమోదులో గత ఏడాది అనేక లోపాలు, అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా పరిహారం పంపిణీ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈక్రాప్ నమోదు ప్రక్రియ సక్రమంగా చేపట్టారో లేదోనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పూర్తి స్థాయిలో పై స్థాయి అధికారి నుంచి సిబ్బంది వరకు క్షుణ్ణంగా ఈక్రాప్ నమోదు జాబితాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీంతో వారం రోజులుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈక్రాప్ నమోదును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్, జేసీ ప్రత్యక్షంగా ఈక్రాప్ నమోదు కార్యక్రమంపై తనిఖీలు చేపడుతున్నారు. సూపర్‌చెక్ కార్యక్రమం వల్ల అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అర్హులకే దక్కుతాయని కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు.