తెనాలిలో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణ హత్యకు గురయ్యాడు. వడ్డెర కాలనీకి చెందిన బత్తుల అనిల్‌ను కత్తులతో అతి దారుణంగా పొడిచి హతమార్చారు. కొద్దిరోజులుగా హైదరాబాదులో ఉంటూ శనివారం సాయంత్రం అనిల్ తెనాలి వచ్చారు. వ్యక్తిగత కక్షలతో సమీప బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుల్తానాబాద్‌కు చెందిన చింటూ, రంగారావు, రాజేష్, పండు, ప్రేమ్ కలిసి కొడుకును హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.