ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుట్ర పూరితంగా వైసీపీ నాయకులు వ్యవహరించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 01:02 PM

మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం మొదలైంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , పీఏసీ‌ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ...  జనసేన పార్టీకి జనాదరణ పెరుగుతోందని, జన సైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం  కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విశాఖపట్నంలో జరిగిన ఘటన రాష్ట్రం మొత్తం చూసిందని, కుట్ర పూరితంగా వైసీపీ నాయకులు వ్యవహరించారని అన్నారు. ఐపీయస్ అధికారి పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు ప్రజా స్వామ్య విరుద్దమన్నారు. హోటల్‌లో చొరబడి మరీ జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో లేని‌వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com