ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొరంగం తవ్వకాల పనుల్లో అపశ్రుతి..నలుగురి మరణం

national |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 11:51 PM

జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర విషాధం చోటు చేసుకొంది. జలవిద్యుత్ నిర్మాణం సొరంగం తవ్వకాల పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం సొరంగం కూలిన ఘటనలో నలుగురు చనిపోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. కిష్టావర్ వద్ద నిర్మిస్తున్న రాట్లే పవర్ ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పవర్ ప్రాజెక్ట్ కోసం సొరంగ నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడక్కడే నలుగురు చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ‘‘రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యింది.. మొత్తం నాలుగు మృతదేహాలతో పాటు గాయపడిన ఆరుగుర్ని బయటకు తీశాం’’ అని కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ తెలిపారు.


మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరుగురు గురితో కూడిన రెస్క్యూ టీం కూడా శిథిలాల కింద చిక్కుకుపోయిందని తెలిపారు. ‘‘రాట్లే పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కిష్టావర్ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడాను.. ప్రమాదంలో దురదృష్టవశాత్తూ జేసీబీ డ్రైవర్ చనిపోయాడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆరుగురు రెస్యూ టీం సభ్యులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


దేశ విభజన సమయంలో సింధూ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. ఈ విషయంలో భారత్, పాక్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. సింధూ నది ఉపనది చీనాబ్ నదిపై కిష్టావర్ వద్ద భారత్ రూ.5,298 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ హైడల్ ప్రాజెక్టుపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ప్రపంచ బ్యాంకులోనూ పలుమార్లు ఫిర్యాదు చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com