బెంగళూరుకు చెందిన యదునంద్ ఆచార్య అనే వ్యక్తి ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనను భార్య కొడుతోందని, కత్తితో దాడి చేసిందని అతడు వాపోయాడు. ఈ ఘటనలో మహిళ కాబట్టి అంతా తన భార్యకే సపోర్ట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. గృహహింసకు పాల్పడుతున్న తన భార్య నుంచి తనను కాపాడాలని వేడుకుంటున్నాడు. దీనిపై ట్విట్టర్లో ప్రధాని కార్యాలయాన్ని, బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశాడు.