వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రం అధోఃగతిపాలవుతోందని పెడన నియోజకవర్గ వర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గూడూరు మండలంలోని శారదాయిపేట, అనంతాయిపేట, కప్పలదొడ్డి గ్రామాల్లో ఆదివారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెంపు, పన్నుల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని ప్రజలకు వివరించారు. శారదాయిపేటలో వైసీపీ నాయకుడు అన్నవరపు దుర్గారావు టీడపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాయవరంలో కాపులతో సమావేశమై వైసీపీ ప్రభుత్వం కాపులకు చేస్తున్నా అన్యాయాన్ని వివరించారు. పోతన స్వామి, గోపి నాగబాబు, ఎన్.ఏ.బేగ్ బొర్రా శ్రీనివాసరావు, కట్టా మునేశ్వరరావు, కాసగాని శ్రీనివాసరావు, ఆలపాటి సత్యన్నారాయణ, తోట వేణు, పామర్తి రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.