పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని శాసనమండలికి పంపుదామని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు. ఆదివారం సీఆర్ భవన్‌లో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల సీపీఐ, ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం సుల్తాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గిడ్డయ్య మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి బరిలో నిలిచారని, వారి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా వారి విజయానికి కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, పట్టుభద్రులు ఈనెల 7వతేదీ లోపు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు రాజాసాహెబ్, రామాంజినేయులు, నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, సుంకన్న, జిల్లా సమితి సభ్యులు సురేంద్ర, కృష్ణ, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు గురుదాసు, నాయకులు రంగన్న, కారన్న, పెద్దవీరన్న, అల్తాఫ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.