అనకాపల్లి మండలంలోని రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు 3 నెలలపాటు శిక్షణ ఇచ్చి, అనంతరం వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీపీతోపాటు కేంద్రం కో-ఆర్డినేటర్ చాముండేశ్వరరావు, సర్పంచ్ ఎం.సన్యాసమ్మ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.