కాపు సామాజికవర్గ అభ్యున్నతికి వైయస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని, రాజకీయపరంగా, ఏరకంగా చూసుకున్నా గత ప్రభుత్వాలతో పోల్చితే కాపు వర్గానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందనేది వాస్తవం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజమండ్రిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సామాజికవర్గ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కాపుల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాలను సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.