ప్రగతి అనేది కేవలం అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవ రూపంలో ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలన్నారు. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలని సూచించారు.ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.