కాళ్ల మజిల్స్‌లో నొప్పి ఇటీవలి కాలంలో తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ నొప్పిని సులభంగా తగ్గించే విధానముంది. మజిల్ పెయిన్స్ దూరం చేసేందుకు వేడి నీళ్లలో ఉప్పు వేసి కాస్సేపు ఆ నీటిలో కాళ్లు పెట్టుకుని ఉంచుకోవాలి. వేడి నూనెతో కాళ్లకు మస్సాజ్ చేసినా మంచి ఫలితాలుంటాయి. వర్కవుట్స్ ఎప్పుడు చేసినా కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలి. పోషక పదార్ధాలతో నిండి ఉన్న డైట్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే చాలావరకూ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజకు 7-8 గ్లాసుల మంచి నీళ్లు కచ్చితంగా తాగాలి. వేడి చేయకుండా ఉండేందుకు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.