అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.07 గంటలకు భూకంపం సంభవించింది. తవాంగ్‌కు ఉత్తరాన 81 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదు అయినట్లు వెల్లడించింది. కాగా, భూ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.