తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కాట్టాతురైలో మోసగాడి గుట్టురట్టు అయింది. విను (22) అనే ప్లంబర్కు పెళ్లైంది. అయినప్పటికీ మార్తాండంలో ఉండే ప్లస్-2 చదివే అమ్మాయిని, ఆమెకు తెలియకుండా ఆమె ఫ్రెండ్ని ప్రేమించాడు. ఇద్దరినీ కిడ్నాప్ చేసి, చెన్నై తిరువణ్ణామలైకు తీసుకొచ్చాడు. మాయమాటలతో వలలో వేసుకుని, ఓ గది తీసుకుని వారితో సహజీనం చేస్తున్నాడు. బాలికల పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.