చిత్తూరు జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అసిస్టెంట్ కమిషనరు ఏకాంబరం ఫిర్యాదులు స్వీకరించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో చౌడేపల్లె మండలం ఎ. కొత్తకోట, పుంగనూరు మున్సిపాలిటీ పెద్దమఠం, చిత్తూరు, గంగాధరనెల్లూరు, ఐరాల మండలాలకు చెందిన ఏడుగురు వివిధ సమస్యలపై ఏసీకి ఫిర్యాదులు అందజేశారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ కార్యాలయ సిబ్బంది, ఈవోలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.