పెదతాడేపల్లి జంక్షన్ వద్ద ప్రమాదాలు జరగకుండా రహదారి విస్తరణ పనుల్లో అలైన్మెంట్ మార్చాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అల్లాడి సముద్రం చెరువు గట్టు వద్ద జడ్ ఆకారంలో మలుపు వల్ల విద్యార్థు లు, రైతులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇంజనీర్లు దాన్ని సవరించాలని స్థానిక రైతులు సోమవారం ధర్నా చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రహదారి పనులు కొనసాగిస్తున్నారని వెంటనే పనులు ఆపి ప్రమాదాలు నివారణకు చర్యలు చేపట్టాలని బండి శ్రీనివాస్ కోరారు.