రాష్ట్రంలో ప్రస్తుతం దొంగల ప్రభుత్వం పాలిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. నిత్యావసర, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యలను వంచించిన వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే అదపాక జంక్షన్ నుంచి అదపాక, గుర్రాలపాలెం, పాత, కొత్తకుంకాలు మీదుగా 20 కిలోమీటర్లు దూరం బీటీ రోడ్డు నిర్మించామని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముప్పిడి సురేష్, ఐ.తోటయ్యదొర, లంక నారాయణరావు, డి.అజార్, వెంకటరమణ, మధుబాబు, ప్రకాశరావు, గంట్యాడ మహేష్, తదితరులు పాల్గొన్నారు.