శ్రీకాకుళం జిల్లా, స్పందనలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్పందనలో వచ్చిన వినతులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అర్జీల పరిష్కారానికి వెళ్లిన ఫొటోలు అప్‌లోడ్ చే యాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి 280 వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో బి.శాంతి, ఉప కలెక్టర్ జి.జయదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి రెడ్‌క్రాస్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్‌ను వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు గురుగుబెల్లి దామోదరరావు, పారుపల్లి శ్రీనివాసరావు కలెక్టరేట్‌లో కలిసి సత్కరించారు.