రాయచోటి జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, రూ.10లక్షల విలువ చేసే 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థనరాజు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్ళితే....ఓబులవారిపల్లె ఎస్‌ఐ శ్రీకాంతరెడ్డి ఆద్వర్యంలో సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం వైకోట గ్రామం పరిధిలోని అటవీ ప్రాంతంలో దాడి చేసి అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 2 దుంగలను స్వాధీనం చేసుకొని, నందలూరు మండలానికి చెందిన సింగనమల రవి అనే స్మగ్లరును అరెస్టు చేశారు. అతని ఇచ్చిన సమాచారం మేరకు నందలూరు మండలం గుంటికాడపల్లె అటవీ ప్రాంతంలో రవాణా చేయడానికి సిద్ధం చేస్తున్న 571 కేజీల బరువు గల 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకు న్నారు. నందలూరు మండలానికి చెందిన పొడమేకల వెంకటపతి, పెనగలూరు మండలానికి చెందిన నన్నూరు యానాదయ్య అనే స్మగ్లర్లను అరె స్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. అలాగే వైకోట గ్రామ అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద 3 దుంగలను స్వాధీనం చేసుకొని.. వైకోట అరుంధతీవాడకు చెందిన నాగిపోగు సుబ్రహ్మణ్యం, గోపుదారి రమే్‌షలను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్, రైల్వేకోడూరు సీఐ విశ్వనాధరెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.