వైసీపీకి వచ్చిన 151 అసెంబ్లీ సీట్లలో రెండు పక్కల ఉన్న ఆ ఒకటిని తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇక జగన్‌కు మిగిలేది ఐదు సీట్లు మాత్రమేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో సోమవారం క్లస్టర్, యూనిట్, పోలింగ్ బూత్ ఇన్‌చార్జిల సమావేశం, మైలవరం నియోజకవర్గ పార్టీ వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ .... నెల రోజులు కష్టపడి ఓటరు లిస్టులో మార్పులు చేర్పులు చేయాల్సినవి చేస్తే ఖచ్చితమైన ఓటుతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అధికార కాంక్షఉన్న జగన్‌కు సాయం చేసి రాష్ట్రానికి, దేశానికి అన్యాయం చేశానని పీకే ఒప్పుకున్నారన్నారు. మైలవరం ఎమ్మెల్యే, అతని అనుచరులు అవినీతి సొమ్ముతో డబ్బు వెదజల్లి ఓట్లు వేయించుకుంటామనే ధీమాతో ఉన్నారన్నారు. బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు భయపడే ప్రశక్తే లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దారు నాయక్, కోనేరు సురేశ్, జంపాల సీతారామయ్య, జువ్వా రాంబాబు, పసుపులేటి పాపారావు, కోమటి సుధాకరరావు, నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొన్నారు.