మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని తితియాజోషిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి మద్యం మత్తులో అత్యాచారం చేశాడో వ్యక్తి. ఆ తర్వాత చెట్ల పొదల్లో నగ్నంగా పడేసి పారిపోయాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దీపావళి పండుగ సందర్భంగా తన మామ ఇంటికి వచ్చిన చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక కిలోమీటరు దూరంలోని నిర్మానుష్యప్రాంతంలో పడేశాడు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రైవేట్ పార్ట్‌లో తీవ్రగాయమైందని పోలీసులు తెలిపారు.