పూణెలోని ఎరవాడ వద్ద, శాస్త్రినగర్ రోడ్డు సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ శివషాహి బస్సులో మంగళవారం మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. శాస్త్రినగర్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా నిర్థారణ కాలేదు.