తొంభై నాలుగేళ్ల వయసులోనూ ఓ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్న ఆంధ్ర వర్సిటీ విశ్రాంత ఆచార్యురాలు చిలుకూరి శాంతమ్మను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ నగరంలోని ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వయస్సు ఐపోయినా కానీ, జీతం తో సంభంధం లేకుండా సమాజంలో తనకి వచ్చిన విద్యని నలుగురికి పంచాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలియజేసారు.