ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన వైసీపీ ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెడుతోందని, టీడీపీ రాష్ట్ర నేతలు సింహాద్రి కనకాచారి, వీరంకి గురుమూర్తి విమర్శించారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.... రాజ్యాంగబద్దంగా నడచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన మంత్రులు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సమావేశం నిర్వహించడమేంటన్నారు. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు చేసిన కార్యక్రమాలను వివరించిన నేతలు జగన్ హయాంలో కార్పొరేషన్‌కు నిధులు లేకుండా, వసతులు లేకుండా నిర్వీర్యం చేశారన్నారు. మంత్రుల సమావేశం కాపు నేతను సీఎం చేయడానికా, జగన్‌రెడ్డిని సీఎం చేయడానికా చెప్పాలన్నారు. చిల్లర వేషాలు వేస్తే వైసీపీ కాపు నేతలకు కాపులు తగిన బుద్ధి చెబుతారన్నారు.