రాజాం పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఠాణావీధిలో ఇళ్ల సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులతో పాటు ఇద్దరి తల్లిదండ్రులపై దాడి చేసాయి. కుక్కల నుంచి చిన్నారులను కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు గాయపడ్డారు.పలు ప్రాంతాల్లో మరో ఐదుగురికి కుక్కలు కాటేశాయి. గాయపడిన చిన్నారులు ఉజ్వల, అనిరుధ్, యశస్వితోపాటు కన్నమ్మ, ఈశ్వరరావు రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్సపొందగా మరో ఐదుగురు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. పట్టణంలోని పలువీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నా వాటి నియంత్రణకు మునిసిపల్ యంత్రాంగం కనీస చర్యలు తీసుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.