శ్రీబాగ్ ఒడంబడికలో పొందుపరచిన రాయలసీమ హక్కుల సాధించుకుందామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ... 1956లోనే రాయలసీమ రాజధాని కర్నూలును హైదరాబాద్‌కు తరలించి తీరని అన్యాయం చేశారన్నారు. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగుతోందని, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు నవంబరు 1న నిర్వహిస్తూ శ్రీబాగ్ ఒప్పంద ఒడబండిక తెలియకుండా చేస్తున్నారని అన్నారు. దీంతో రాయలసీమ హక్కులకు భంగం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమకు న్యాయ రాజధాని అంటూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాయలసీమ హక్కుల సాధన కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని, ఈ నెల 16న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, మునాఫ్, నాగసుధాకర్, పక్కీర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, సుబ్బరాయుడు, డి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.