రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బుధవారం సాయంత్రం పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలను పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇదే క్రమంలో మన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కృష్ణ బాబు, పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.