జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి మున్సిపాలిటీలోని 9వ వార్డు 5 వసచివాలయ పరిధిలోని అలీమాబాద్ వీధి, ఫయాజ్ బంగ్లా, నార్ జబ్బార్ వీధి, నాజ్ హాల్, ఆయేషా వాటర్ ఫిల్టర్ వీధి, అమీర్ జాన్ సా మిల్, అక్సా మసీదు, గౌస్ వీధి ఆంజనేయ స్వామి ఆలయ వీధులలో గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటా పర్యటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్న విషయాలను ప్రజలతో నేరుగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రధానమైన అంశాలలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి , వైయస్సార్ చేయూత, పెన్షన్ పెంపు , ఫీజు రియంబర్స్మెంట్ , యువతకు ఉపాధి, వైయస్సార్ ఆసరా, మైనారిటీ, బీసీ సంక్షేమం నాయి బ్రాహ్మణులు, టైలర్లు రజకులకు ఆర్థిక సహాయం, చేయూత, చేనేత కార్మికులకు సంక్షేమం వంటి కార్యక్రమాలు ఆయా లబ్ధిదారులకు చెందుతూ అంశాలను ఇంటింటా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.